epaper
Wednesday, October 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హోంగార్డుల‌కు జీతాలు చెల్లించ‌క‌పోవ‌డం సిగ్గుచేటు

హోంగార్డుల‌కు జీతాలు చెల్లించ‌క‌పోవ‌డం సిగ్గుచేటు
ప్రతి నెలా ఇదే తీరు.. పట్టించుకునే వారే లేరు:మాజీ మంత్రి హ‌రీశ్‌రావు

కాక‌తీయ‌, హైదరాబాద్ : నెల ముగింపున‌కు వ‌స్తున్నా రాష్ట్రంలోని హోంగార్డుల‌కు ఇంకా జీతాలు చెల్లించ‌క‌పోవ‌డం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు విమర్శించారు.. రాష్ట్రంలోని హోంగార్డు సోదరుల ఆవేదన విన‌ప‌డ‌డం లేదా అని సోష‌ల్ మీడియా ఎక్స్(ట్విట్ట‌ర్‌) వేదిక‌గా సీఎం రేవంత్‌రెడ్డిని ఆయ‌న ప్ర‌శ్నించారు. నెల మొదలై 22 రోజులు గడుస్తున్నా హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు అన్నారు.చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు, చేతిలో చిల్లిగవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. భద్రాది కొత్తగూడెం, మెదక్, మహబూబ్ నగర్, వనపర్తి, జగిత్యాల, వరంగల్, రామగుండం, వికారాబాద్ జిల్లాల్లో పని చేస్తున్న హోంగార్డుల‌కు జీతాలు రాలేద‌న్న అంశాన్ని ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు ప్ర‌స్తావించారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చెయ్యాల్సిన దుస్థితి నెల‌కొంద‌న్నారు. ఈఎంఐలు చెల్లించకపోవడం వల్ల బ్యాంక్‌ అధికారులు ఫోన్లు చేసి నిలదీస్తున్న పరిస్థితి ఎదుర్కొంటున్న‌ట్లు చెప్పారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతి నెలా ఇదే తీరు కొనసాగుతున్నా పట్టించుకునే వారే లేర‌న్నారు. మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరికి ఏం సమాధానం చెబుతార‌ని ప్ర‌శ్నించారు. మీరు మంత్రిగా ఉన్న హోంశాఖలోనే ఇలాంటి దుర్బర పరిస్థితి త‌లెత్తితే వారి ఆవేద‌న ఇంకెవ‌రికి చెప్పుకోవాల‌న్నారు. పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు, మాటల్లో ఫేకుడు, ఢిల్లీకి వెళ్లి జోకుడు ఇదేనా మీకు తెలిసిందన్నారు. వెంటనే హోంగార్డులకు వేతనాలు చెల్లించాలని, ప్రతి నెలా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయ‌న‌ డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సీఐడీ కలకలం.. హైడ్రామా మధ్య ఏకగ్రీవం

సీఐడీ కలకలం.. హైడ్రామా మధ్య ఏకగ్రీవం బాదం ప్రవీణ్‌ నామినేషన్‌ ఉపసంహరణ అధ్యక్షుడిగా కాట్రగడ్డ...

బీజేపీ విధానాలపై పోరాటాలు ఉధృతం చేస్తాం

బీజేపీ విధానాలపై పోరాటాలు ఉధృతం చేస్తాం ఎల్‌నినో కరువు నివారణకు కేంద్ర, రాష్ట్ర...

పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి

పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి నవంబర్‌ 6లోగా ప్రతి పట్టభద్రుడి ఓటు...

వెంకన్న కుటుంబానికి అండగా ఉంటాం

వెంకన్న కుటుంబానికి అండగా ఉంటాం డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ, రేగుంట సునీల్‌ మాదిగ అనారోగ్యంతో...

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవబోతున్నాం!

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవబోతున్నాం! ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిస్తే రాబోయే...

దసరాకు ఇస్తామన్న డీఏలు ఏమయ్యాయి?

దసరాకు ఇస్తామన్న డీఏలు ఏమయ్యాయి? యూత్‌ డిక్లరేషన్‌, మెగా డీఎస్సీ హామీలు ఏమయ్యాయి? ఉద్యోగులు,...

పర్వతగిరి మండలంపర్వతగిరి మండలంలో మహిళ హత్య

పర్వతగిరి మండలంపర్వతగిరి మండలంలో మహిళ హత్య   హర్జ తండాకు చెందిన పాత్య పూలమ్మ...

అమరవీరుల స్ఫూర్తితో ముందుకు సాగాలి

అమరవీరుల స్ఫూర్తితో ముందుకు సాగాలి కరీంనగర్‌లో 20 కి.మీ. సైకిల్‌ ర్యాలీ విద్యార్థులు, వైద్యులు,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.