కత్తులు, గొడ్డళ్లతో 52 మందిని నరికి చంపేశారు.. ఆ దేశంలో రెచ్చిపోయిన తిరుగుబాటుదారులు..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ఆఫ్రికా దేశమైన కాంగోలో ఇస్లామిక్ స్టేట్ మద్దతు ఉన్న తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. కత్తులు, గొడ్డళ్లతో 52 మందిని నరికి అతికిరాతకంగా చంపేశారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు వెల్లడించారు. కాంగో దళాల చేతిలో ఓటమి పాలవ్వడంతో రగిలిపోయిన అలైట్ డెమోక్రటిక్ ఫోర్సెస్ సభ్యులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అక్కడి అధికారి ఒకరు తెలిపారు. బెని, లుబెరో ప్రాంతాల్లోని పౌరులపై ఏడీఎఫ్ తిరుగుబాటుదారులు దాడికి పాల్పడినట్లు చెప్పారు. నిద్రిస్తున్న ప్రజలను లేపి తాళ్లతో చేతులు కట్టేసి కత్తులు, గొడ్డళ్లతో అతికిరాతకంగా నరికి...