కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి..12 మంది దుర్మరణం..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: చైనాలో నిర్మిస్తున్న ఓ భారీ రైల్వే వంతెన నిర్మాణంలోనే ఉండగానే కూలిపోయింది. యెల్లో రివర్ పై శుక్రవారం జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి ఆచూకీ లభించలేదు. సిచువాన్-కింగ్ హై రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సైట్లో ప్రాజెక్టు మేనేజర్ తో సహా మొత్తం 16 మంది ఉన్నట్లు పీపుల్స్ డైలీ తెలిపింది. స్టీల్ కేబుల్ తెగిపోవడమే ఈ ఘటనకు కారణమని ప్రభుత్వ వార్త...