గోశాల నిర్వాహకులకు చేయూతనివ్వాలి: బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి

కాకతీయ, హనుమకొండ : నగరంలోని ఓరుగల్లు భద్రకాళి దేవాలయం సమీపంలో నిర్వహిస్తున్న గోవింద గోశాలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి సందర్శించారు. ఈ గోశాలను తాడూరి దీప్తి, శ్వేతా, ప్రీతి అనే ముగ్గురు అక్కాచెల్లెల్లు కలిసి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఆధునిక పోకడల వైపు పరుగులు తీస్తున్న యువతలో ఇలాంటివారు గోసేవలో అంకితభావంతో ముందుకు రావడం ఎంతో సంతోషకరమని అన్నారు. గోసంరక్షణ, గోపాలన, గో పదార్థాల వినియోగంపై సమాజంలో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఈ సోదరీమణులు చేస్తున్న...