విద్యారంగ అభివృద్ధికి సంపూర్ణ కృషి చేస్తాం: ఐటీ, పరిశ్రమలు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్
కాకతీయ, మంథని: మంథని ప్రాంతంలో విద్యా రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యరంగ అభివృద్దికి సంపూర్ణ కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంథని మున్సిపాలిటీ పరిధిలో విస్తృత పర్యటన చేశారు. ఈ సందర్బంగా మంత్రి 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్ సెంటర్‌కు శంకుస్థాపన చేసి, ఎంపీపీఎస్ బాలికల పాఠశాలలో టీచ్ ఫర్ చేంజ్ (మంచు...