Gold Rate: హమ్మయ్య..దిగివస్తున్న బంగారం ధరలు..!!
కాకతీయ, బిజినెస్ డెస్క్: మహిళలకు గుడ్ న్యూస్. భారీగా పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా దిగివస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయంపై స్పష్టత కోసం పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించడంతో, ధరలు గణనీయంగా తగ్గిపోయాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,300 పడిపోయి తులం ధర రూ.1,13,800కు చేరగా, 22 క్యారెట్ల బంగారం కూడా అదే స్థాయిలో తగ్గి రూ.1,13,300గా నమోదైంది. బంగారం మాత్రమే కాకుండా వెండి ధరల్లోనూ కోతలు చోటుచేసుకున్నాయి. బుధవారం వెండి ధర కిలోకు రూ.1,670 తగ్గి...