Gold Rate Today: పసిడిప్రియులకు బిగ్ రిలీఫ్..దిగివస్తున్న బంగారం ధరలు..!!

కాకతీయ, బిజినెస్ డెస్క్: ఇటీవల వరుసగా రికార్డులు సృష్టించిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టి కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పసిడి ఎగిసిపడుతూ కొత్త గరిష్టాలను తాకింది. అయితే తాజాగా వరుసగా రెండో రోజు ధరలు గణనీయంగా తగ్గడంతో వినియోగదారులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ.600 పడిపోగా, ప్రస్తుతం అది రూ.1,13,200గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.500 తగ్గి రూ.1,12,800గా ఉంది. ఈ తగ్గుదల...