దసరాకు కొత్త కారు కొనాల్సిందే.. భారీగా తగ్గనున్న మారుతీ కార్ల ధరలు..!!
కాకతీయ, బిజినెస్ డెస్క్: భారతీయ ఆటోమొబైల్ రంగంలో అగ్రగామి కంపెనీ మారుతి సుజుకీ కారు ప్రేమికులకు పెద్ద శుభవార్త అందించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో వాహన ధరలు గణనీయంగా తగ్గబోతున్నాయి. దీనిని అనుసరించి మారుతి సుజుకీ తమ కార్ల ధరలను రూ.1.29 లక్షల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి రానున్నాయని కంపెనీ ప్రకటించింది. మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పార్థో బెనర్జీ తెలిపిన వివరాల ప్రకారం, పాపులర్...