Gold Rate Today: పెరిగిన బంగారం ధర..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
కాకతీయ, బిజినెస్ డెస్క్: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా పెరుగుతూ సరికొత్త గరిష్టాలను నమోదు చేస్తున్నాయి. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తులపై దృష్టి పెడుతున్నారు. ఫలితంగా బంగారంపై డిమాండ్ గణనీయంగా పెరిగింది. మరోవైపు రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే క్షీణించడం కూడా పసిడి ధరలు ఎగబాకడానికి మరో కీలక కారణంగా కనిపిస్తోంది. సెప్టెంబర్ 20న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,340కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1,02,060గా...