నాణ్యత, శుభ్రత పాటించకపోతే చర్యలు తప్పవు

మునిసిపల్ కమిషనర్ మల్లికార్జున్ 8 షాపులకు రూ.51 వేల జరిమానా కాకతీయ, హుస్నాబాద్ : నాణ్యతాప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవని మునిసిపల్ కమిషనర్ మల్లికార్జున్ హెచ్చరించారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని పలు హోటల్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు, సింగిల్ యూస్ ప్లాస్టిక్, పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు పాటించని 8 షాపులకు రూ.51 వేలు జరిమానా విధించారు. ఇందులో దావత్ రెస్టారెంట్ కు అధికంగా రూ.20వేలు విధించగా బావర్చి రెస్టారెంట్, రాజు గారి బిర్యానీ...