42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరగాలి
సమస్యలు లేని సామాజిక తెలంగాణే కవిత లక్ష్యం కరీంనగర్ జిల్లా జాగృతి అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలో సోమవారం తెలంగాణ జాగృతిలోకి బీసీ కుల సంఘాల నాయకులు శ్రీరాముల రమేష్, గర్షకుర్తి విద్యాసాగర్, కోత్వాల అంజనేయులు తదితరులు చేరారు. వారికి జిల్లా జాగృతి అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ.. కవిత నాయకత్వంలో తెలంగాణ జాగృతి కరీంనగర్ జిల్లాలో బలోపేతం అవుతోందని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, మన...