మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధన దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఆదికవి శ్రీ మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకొని మంగళవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాకవి వాల్మీకి ఆధ్యాత్మికవేత్తగా రామాయణం రచించి ఆదికవిగా వెలుగొందారని, రామాయణం ద్వారా అనేక విలువలను...