హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు
కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లాలో పాత కక్షల నేపథ్యంలో జరిగిన హత్య కేసులో కీలక తీర్పు వెలువడింది. బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్దునూరు గ్రామ శివారులో 2021లో జరిగిన దుర్గయ్య హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవితఖైదు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.15,000 జరిమానా విధిస్తూ 1వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి నారాయణ తీర్పు వెలువరించారు. కాగా ఈ కేసు సంబంధించిన వివరాలును జిల్లా ఎస్పీ అశోక్ కూమార్ మీడియాకు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన...