బీసీల‌కు అర‌చేతిలో బెల్లంపెట్టి మోచేతితో నాకిస్తున్నారు

కాంగ్రెస్, బీజేపీలను క్షమించ‌రు ఆ రెండు పార్టీల నేత‌ల‌ను నిల‌దీయాలి బీసీ నేతలు బీఆర్ఎస్‌ను తప్పుబట్టడం హాస్యాస్పదం బీఆర్ఎస్ నేత క్యామ మ‌ల్లేష్ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీసీల‌కు అర‌చేతిలో బెల్లం పెట్టి మోచేతితో నాకిస్తున్నార‌ని బీఆర్ఎస్ నేత క్యామ మ‌ల్లేష్ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. కొంద‌రు బీసీ నేత‌లు రేవంత్ రెడ్డి చేతిలో బాడుగ నేత‌లుగా మారార‌ని మండిప‌డ్డారు. తెలంగాణ భ‌వ‌న్‌లో క్యామ మ‌ల్లేష్ మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ బీసీలకు 42 శాతం...