కాంగ్రెస్ బీసీలకు ఏమైనా చేసిందా..?
బీఆర్ఎస్ నాయకుడు యరసంగి పాపయ్య గౌడ్ కాకతీయ, బయ్యారం : మాయ మాటలు చెప్పి బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ది పొందాలని చేసిన కుట్రలు హైకోర్టు తీర్పు ద్వారా పటాపంచలయ్యాయని బీఆర్ఎస్ నాయకుడు యరసంగి పాపయ్య గౌడ్ అన్నారు. 22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన రేవంత్ రెడ్డి, గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్ చేశారే.. తప్పా బీసీలకు 42శాతం రిజర్వేషన్లను సాధించడం పట్ల ఏనాడూ చిత్తశుద్ది ప్రదర్శించలేదని ఆయన ఆరోపించారు....