నిరుపేద విద్యార్థినికి ఆర్థిక సాయం

కాకతీయ, గీసుగొండ : నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన ఓ విద్యార్థిని ఎంబీబీఎస్ సీటు సాధించారు. విష‌యం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ నాయకుడు అల్లం బాలకిషోర్ రెడ్డి ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచారు. మండలంలోని దశ్రు తండాకు చెందిన గిరిజన విద్యార్థిని కేలోతు స్రవంతి (తండ్రి రవి) ఈ సంవత్సరం జరిగిన నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించింది. ఈ క్ర‌మంలో ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు పొందింది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న స్రవంతికి బాలకిషోర్ రెడ్డి ముందుకు వచ్చి...