పాడిపరిశ్రమతో రైతులకు అదనపు ఆదాయం
ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కాకతీయ, కరీంనగర్ : రైతులకు వ్యవసాయం మాత్రమే కాకుండా అదనపు ఆదాయ మార్గాలను కల్పించే పాడిపరిశ్రమపై ప్రత్యేక దృష్టి సారించాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. బుధవారం తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి పశువులకు మంచి మేత, వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం విడతల వారీగా నిర్వహిస్తున్న గాలికుంటు...