ప్రేమ్ సాగర్ రావు త్వరగా కోలుకోవాలని పాదయాత్ర
కాకతీయ, లక్షెట్టిపేట : ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆరోగ్యం మెరుగుపడి, త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలో పాల్గొనాలని ఆశిస్తూ మండలంలోని సూరారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త మల్లికార్జున్ శనివారం సూరారం గ్రామం నుండి దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేశారు. శనివారం కాలినడక వెళ్లి సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్షెటిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ నాయకులు కాలినడకన వెళుతున్న మల్లికార్జున్ ను ఘనంగా స్వాగతించి, పూలమాలలు...