కాకతీయుల కళా వైభవానికి అద్దం ‘రామప్ప’
త్రిపుర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ హేమంత్ వర్మ కాకతీయ, ములుగు ప్రతినిధి : రామప్ప దేవాలయంలోని ప్రతీ శిల్పం కాకతీయుల కళా నైపుణ్యానికి అద్దం పడుతుందని త్రిపుర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ హేమంత్ వర్మ అభిప్రాయపడ్డారు. వరంగల్ జిల్లా పర్యాటక క్షేత్రాలను సందర్శించే రెండు రోజుల పర్యటనలో భాగంగా హేమంత్ వర్మ దంపతులు శనివారం ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించి రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు....