వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి శివకుమార్ కాకతీయ, తుంగతుర్తి: అధిక వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ డిమాండ్ చేశారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని కామ్రేడ్ దుబ్బాక సంజీవరెడ్డి విజ్ఞాన కేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలోఆయన మాట్లాడారు. వారం రోజులుగా జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాలతో రైతులు అన్ని విధాలుగా నష్టపోయారని, కోసిన వరిచేలు ఐకేపీ కేంద్రంలో తడిసి ముద్దయ్యాయని, కోతకు వచ్చిన వరిచేలు...