అంగరంగ వైభవంగా నాగుల చవితి
జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న మహిళలు పాల, నాగబంధం కావడలు సమర్పించిన స్వాములు కాకతీయ, గీసుగొండ : నాగుల చవితి వేడుకలు నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా నిర్వహించారు. నాగుల చవితి పండుగను పురస్కరించుకొని మండలంలోని ప్రసిద్ధిగాంచిన ఊకల్ శ్రీవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారికి విశేష అభిషేకము, పూజలు నిర్వహించి, గజమాల బంతిపూలతో ప్రత్యేకంగా అలంకరించారు. మండల దీక్షలు చేపట్టిన స్వాములు పంచామృత కావడులతో మంగళ వాయిద్యాలతో...