రైతు సంతోషంతోనే రాష్ట్రం సుభిక్షం..

సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లాలోని  ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో సోమవారం రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రిమంత్రి కొండా సురేఖ సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు.  మాజీ సీఎం రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం కళకళలాడిందన్నారు. గత పదేళ్లలో రైతు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. వరి, పత్తి కొనుగోలు...