టవర్ సర్కిల్‌లో అగ్ని ప్రమాదం

తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది కాకతీయ, కరీంనగర్ : నగరంలోని ప్రధాన వ్యాపార ప్రాంతమైన టవర్ సర్కిల్‌లో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టవర్ సర్కిల్ రోడ్డుపై ఉన్న ఓ దుస్తుల షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొద్ది సేపట్లోనే మంటలు పక్కనే ఉన్న ఫోటో స్టూడియో, వెడ్డింగ్ డెకరేషన్ సామగ్రి షాపులకు కూడా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని రెండు ఫైరింజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. దట్టమైన పొగ కారణంగా...