ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కాకతీయ, పరకాల : పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం భారతదేశ మొట్టమొదటి మహిళ ప్రధాని, ఇందిరా గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ చిత్రపటానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ అభివృద్ధి, ఐక్యత, సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అర్పించిన ఇందిరాగాంధీ సేవల చిరస్మరణీయమన్నారు. ఆమె చూపిన మార్గదర్శనం ఇప్పటికీ దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తోందని అన్నారు....