₹3,198 కోట్ల లాభాలు ఆర్జించిన అదాని ఎంటర్‌ప్రైజెస్
కాకతీయ, బిజినెస్ డెస్క్ : అదానీ ఎంటర్‌ప్రైజెస్ 2026 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసిక (Q2FY26) ఫలితాలను మంగళవారం ప్రకటించింది. కంపెనీ ఏకీకృత నికర లాభం 83.7% పెరిగి ₹3,198 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది ₹1,741.75 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం 6% తగ్గి ₹21,844 కోట్లుకు చేరుకుంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఆదాయం ₹23,196 కోట్లుగా ఉంది. అదానీ విల్మార్ (Adani Wilmar)లో పాక్షిక వాటా విక్రయం, అంబుజా సిమెంట్స్‌తో...