‘నీట్’లో ప్రతిభ చూపిన విద్యార్థినికి సన్మానం

కాకతీయ, నర్సంపేట : నర్సంపేట మండలం గురిజాల గ్రామానికి చెందిన ఆముదాల భాగ్యలక్ష్మి - లక్ష్మినారాయణ దంపతుల కూతురు ప్రహర్ష నీట్ లో అత్యంత ప్రతిభ కనబర్చి ఎంబీబీఎస్ సీటు సాధించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు చిన్నపెళ్లి నర్సింగం మాట్లాడుతూ విద్యార్థులు బాల్యదశ నుంచే క్రమశిక్షణతో చదువుల్లో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. మెడికల్ సీటు సాధించిన ప్రహర్ష భవిష్యత్తులో గొప్ప డాక్టర్ అయి పేదలకు వైద్య సేవలు అందించాలని...