శ్రీ అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన మహాత్మా నగర్
శ్రీ అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన మహాత్మా నగర్ విద్యారణ్య భారతి స్వామివారి సువర్ణ కరకమలాలతో ఘనంగా యంత్ర–ప్రాణ ప్రతిష్ట కాకతీయ, కరీంనగర్ : తిమ్మాపూర్ మండలంలోని మహాత్మా నగర్ గ్రామం ఆదివారం రోజున భక్తి తరంగాలతో ఊగిసలాడింది. శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం నుంచే “స్వామియే శరణం అయ్యప్ప” నినాదాలతో గ్రామం మార్మోగిపోయింది.గత రెండు రోజులుగా వేదమూర్తి బ్రహ్మశ్రీ జక్కి కృష్ణావధాని, గురుస్వామి కావేటి పరమేశ్వర స్వామి మార్గనిర్దేశంలో వేదపండితులు మంత్రోచ్ఛారణలతో హోమ–యజ్ఞాదులు శాస్త్రోక్తంగా నిర్వహించారు....