ఘనంగా కంఠమహేశ్వర స్వామి కల్యాణం

ఘనంగా కంఠమహేశ్వర స్వామి కల్యాణం కాకతీయ,రాయపర్తి : వ‌రంగ‌ల్ జిల్లా రాయ‌ప‌ర్తి మండలంలోని గట్టికల్లు గ్రామంలో గౌడ కులస్తులు ఆరాధ్య దైవంగా కొలుచుకునే సుమరాంబ, కంఠమహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్చరణలతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం మామిడి తోరణాలతో ఆలయాన్ని అలంకరించి గణపతి పూజా కార్యక్రమం,గౌడ కులస్తుల ఇంటి నుండి తీసుకువచ్చిన జలబిందలు,పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేసి నూతన వస్త్రాలంకరణ చేశారు.సోమవారం రాత్రి ఊరేగింపుగా వెళ్లి అత్యంత భక్తిశ్రద్ధలతో కంఠమహేశ్వర స్వామికి బోనం నైవేద్యంగా సమర్పించారు.ఈ సందర్భంగా గౌడ సంఘం గ్రామ...