తొలి విడత సర్పంచ్ ఎన్నికల‌కు 843 మంది పోలీసులు భారీ బందోబస్తు

తొలి విడత సర్పంచ్ ఎన్నికల‌కు 843 మంది పోలీసులు భారీ బందోబస్తు కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బీమారం, కోరుట్ల, మెట్‌పల్లి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఎన్నికల సామగ్రి పంపిణీని కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య అధికారులు పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని బలమైన ఎస్కార్ట్‌తో తరలించారు.జిల్లాలో మొత్తం 1172 పోలింగ్...