వీకర్స్ కాలనీకి రోడ్డు కేటాయింపుపై మంత్రి హామీ
వీకర్స్ కాలనీకి రోడ్డు కేటాయింపుపై మంత్రి హామీ కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి విచారణకు ఆదేశం కాకతీయ, వరంగల్ సిటీ : వీకర్స్ కాలనీ నివాసితులకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శుభవార్త చెప్పారు. కాలనీలోకి వెళ్లే ప్రధాన రోడ్డును ఆక్రమించి ఫ్లాట్లుగా మార్చిన అంశంపై కాలనీవాసులు వ్యక్తం చేసిన ఆవేదనకు మంత్రి స్పందించారు. వరంగల్ తూర్పు శాసనసభ నియోజకవర్గ పరిధిలోని కాశీబుగ్గలో ఉన్న ఓసిటి ఇండోర్ స్టేడియం గేటు సమీపంలోని వీకర్స్ కాలనీ ప్రజలు మంగళవారం మంత్రిని కలసి...