ఇండిగోపై నరేష్ ఆగ్రహం

ఇండిగోపై నరేష్ ఆగ్రహం బస్సుల్లో ప్రయాణికుల్ని కుక్కేశారంటూ ట్వీట్ కాకతీయ, సినిమా : ఇండిగో ఎయిర్‌లైన్స్ సేవలపై టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విమానం ఎక్కేందుకు ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన బస్సుల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించారని ఆరోపించారు. ఈ కారణంగా తీవ్ర అసౌకర్యం కలిగిందని తెలిపారు. ఈ విషయమై ఇండిగో సిబ్బందితో వాగ్వాదం జరిగినప్పటికీ స్పందన లేకపోవడంతో అక్కడి పరిస్థితులను ఫొటోలతో సహా ట్వీట్ చేశారు. బస్సులు ‘టార్చర్ ఛాంబర్‌లా’ మారాయని, సీనియర్ సిటిజన్లను కూడా ఇబ్బంది పెడుతున్నారని...