ఇస్లాంపురం అంగన్వాడీలో ఈసీసీఈ డే
ఇస్లాంపురం అంగన్వాడీలో ఈసీసీఈ డే కాకతీయ, మిర్యాలగూడ : మిర్యాలగూడ అర్బన్ ప్రాజెక్టు పరిధిలో సీడీపీఓ ఆదేశాల మేరకు ప్రతినెల నాలుగో శనివారం నిర్వహించే ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ECCE డే) కార్యక్రమాన్ని శనివారం ఇస్లాంపురం సెక్టర్ సుభాష్‌నగర్ అంగన్వాడి కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రాల్లో అందిస్తున్న విద్య ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుందని, ఆటపాటలతో కూడిన బోధనను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అందిస్తున్నామని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ విధానంతో పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు...