ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ ఎన్నికల మేనిఫెస్టోకు కార్యరూపం కోతుల బెడదకు చెక్ పెట్టిన గ్రామ పాలకవర్గం ఒక్కో కోతికి రూ.250 చొప్పున వ్యయం కాకతీయ, తుంగతుర్తి : తుంగతుర్తి మండలం అన్నారం గ్రామపంచాయతీ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ‘గెలిపిస్తే కోతుల బెడద నుంచి గ్రామాన్ని విముక్తి చేస్తా’ అని ఇచ్చిన మాటకు కట్టుబడి శనివారం కోతులను పట్టించే కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ పాలకవర్గం సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం...