మేడారంలో పోలీస్ రెడ్‌కార్పెట్!
మేడారంలో పోలీస్ రెడ్‌కార్పెట్! సామాన్య భక్తులపై మాత్రం కఠినత్వం వృద్ధులు–వికలాంగుల్ని పట్టించుకోని వైఖరి పోలీస్ కుటుంబాలకు ప్రత్యేక దారి..! ‘అమ్మవార్ల ముందు అందరూ సమానమే కదా?’ కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు కొనసాగుతున్న వేళ, జాతర అధికారిక ప్రారంభానికి ముందే భక్తులు భారీ సంఖ్యలో మేడారానికి చేరుకుంటున్నారు. ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన భక్తులు అమ్మవార్ల దర్శనం కోసం గద్దల వైపు భక్తిశ్రద్ధలతో కదిలారు. అయితే గద్దల వద్ద డ్యూటీలో ఉన్న కొందరు పోలీసుల వైఖరి...