మెట్టుగుట్ట రామాలయం హుండీ ఆదాయం రూ.1.04 లక్షలు
మెట్టుగుట్ట రామాలయం హుండీ ఆదాయం రూ.1.04 లక్షలు కాకతీయ, మడికొండ : దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ మెట్టుగుట్ట రామాలయంలో శుక్రవారం ఐదు హుండీలను లెక్కించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్. సత్యనారాయణ ఆధ్వర్యంలో గిర్మాజిపేట శ్రీ దుర్గేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ప్రసాద్ పర్యవేక్షణలో ఈ లెక్కింపు నిర్వహించారు. హుండీల ద్వారా నోట్ల రూపంలో రూ.90,870లు, నాణేల రూపంలో రూ.13,761లు సమకూరగా మొత్తం ఆదాయం రూ.1,04,631గా నమోదైంది. కార్యక్రమంలో అర్చకులు శ్రీ పరాశరం విష్ణువర్ధనాచార్యులు, శ్రీ రాగిచేడు అభిలాష్ శర్మ, శ్రీ పారుపల్లి సత్యనారాయణ...