మేడారం పనుల్లో అలసత్వం

మేడారం పనుల్లో అలసత్వం క్యూలైన్లు పూర్తి కాక‌పోవ‌డంతో భ‌క్తుల్లో ఆందోళన కొనసాగుతునే ఉన్న విద్యుత్ పనులు మంత్రుల డెడ్‌లైన్‌కు విలువ లేదా? జాతరకు ఇంకా రెండు రోజులే సమయం భక్తుల్లో పెరుగుతున్న‌ అసంతృప్తి కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరుగాంచిన మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర అభివృద్ధి పనుల్లో తీవ్ర అలసత్వం స్పష్టంగా కనిపిస్తోందని భక్తులు, స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరగనున్న...