కర్తవ్యపథ్‌పై గర్వభారతం!
కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా సైనిక శక్తి ప్రదర్శన కాకతీయ, నేషనల్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ ఈ ఉదయం జాతీయ గర్వంతో తళతళలాడింది. పందొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకుంటూ దేశం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. చలిగాలులు వీచినా, కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రజల్లో దేశభక్తి ఉప్పొంగింది. సైనిక విన్యాసాలు, రంగురంగుల శకటాలు, అద్భుత వైమానిక ప్రదర్శనలతో వేడుకలు...