అమ్మవారు అడిగిందా… అలిగిందా?
అమ్మవారు అడిగిందా… అలిగిందా? సారలమ్మ గద్దెకు చేరకముందే గేట్లు ఎందుకు తెరచారు? భద్రతా కారణాలా… సంప్రదాయానికి భంగమా? కాకతీయ, మేడారం బృందం : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో బుధవారం రాత్రి చోటుచేసుకున్న పరిణామాలు భక్తుల్లో ఉత్కంఠను, తీవ్ర చర్చను రేపాయి. కన్నెపల్లి నుంచి సారలమ్మ తల్లి గద్దెకు చేరుకునే కీలక ఘట్టంలో దర్శనాన్ని కొద్దిసేపు నిలిపివేయడం, ఆ తర్వాత మళ్లీ భక్తులను లోపలికి అనుమతించడం వెనుక కారణాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సారలమ్మ గద్దెకు చేరుకునే వేళ మేడారం పరిసరాల్లో భక్తుల రద్దీ ఒక్కసారిగా...