న‌ల్ల‌బెల్లి మండ‌లంలోని మ‌ద్దిమేడారంలో

న‌ల్ల‌బెల్లి మండ‌లంలోని మ‌ద్దిమేడారంలో గద్దెలపైకి చేరుకున్న సారలమ్మ కాకతీయ. నల్లబెల్లి:మద్ది మేడారం జాతరలో భాగంగా బుధవారం రాత్రి 10.04 నిమిషాలకు గాంధీనగర్ నుంచి సారలమ్మ బయలుదేరి గద్దెలపైకి చేరుకున్నారు. స్థానిక ఎస్సై గోవర్ధన్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య సారలమ్మను గద్దెలకు తీసుకువచ్చారు. ఆలయ పూజారులు దురిశెట్టి నాగరాజు, హరికృష్ణలు తమ స్వగ్రామమైన గుండ్లపహాడ్ శివారు గాంధీనగర్ నుంచి డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల నడుమ సారలమ్మను మద్ది మేడారం జాతర గడ్డకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా భక్తుల జయజయధ్వానాలతో పరిసరాలు మార్మోగాయి. మనదేవతలకు...