అడవి పులకించె…సారలమ్మ గద్దెపై కొలువుదీరె!
అడవి పులకించె…సారలమ్మ గద్దెపై కొలువుదీరె! కన్నెపల్లి నుంచి సారలమ్మ రాకతో తొలి ఘట్టం పూర్తి పూనకాల హోరు… శివాలూగిన మేడారం కాకతీయ, మేడారంబృందం : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 వైభవంగా ప్రారంభమైంది. జాతర తొలి రోజైన బుధవారం రాత్రి అడవిమాతల ఆగమనంతో మేడారం పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో ఉట్టిపడాయి. అడవీ మార్గాలన్నీ భక్తజనంతో కిక్కిరిసిపోగా, డోలు దరువులు, కొమ్ము బూరల నాదాల మధ్య అడవి పులకించిపోయింది. కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మ బుధవారం రాత్రి మేడారం...