అడవి పులకించె…సారలమ్మ ఆగమానికి స్వాగతం
అడవి పులకించె…సారలమ్మ ఆగమానికి స్వాగతం కన్నెపల్లి నుంచి గద్దల వైపు సారలమ్మ రాక పూనకాల హోరు… శివసత్తుల ఊగిసలాటతో శివాలూగిన మేడారం కాకతీయ, మేడారంబృందం : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 వైభవంగా ప్రారంభమైంది. జాతర తొలి రోజైన బుధవారం రాత్రి అడవిమాతల ఆగమనంతో మేడారం పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో ఉట్టిపడాయి. అడవీ మార్గాలన్నీ భక్తజనంతో కిక్కిరిసిపోగా, డోలు దరువులు, కొమ్ము బూరల నాదాల మధ్య అడవి పులకించిపోయింది. కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మ బుధవారం రాత్రి...