నామినేషన్ ప్రక్రియలో పొరపాట్లకు తావుండొద్దు

నామినేషన్ ప్రక్రియలో పొరపాట్లకు తావుండొద్దు అభ్యర్థుల సందేహాలు హెల్ప్‌డెస్క్‌లోనే పరిష్కరించాలి కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్ : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణలో చిన్నపాటి తప్పిదాలు కూడా జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్...