పండగ పూట ఎందుకొచ్చినట్టు?!
పండగ పూట ఎందుకొచ్చినట్టు?! ఏనుమాముల మార్కెట్‌కు స్టేట్ విజిలెన్స్ టీమ్ జాతర వేళ విచారణ సాధ్యమా? వ్యాపారులే లేని చోట నిజాలు ఎలా తేలుతాయి..! కాకతీయ, వరంగల్ : విజిలెన్స్ పేరు వినగానే అధికారుల్లో హడల్ మొదలవుతుంది. ఏ ప్రశ్నలు వేస్తారో, ఏ సమాధానాలు ఇవ్వాలో అన్న ఆందోళన సహజం. కానీ అలాంటి ఉత్కంఠ ఏమీ లేకుండానే గురువారం వరంగల్ ఏనుమాముల మార్కెట్‌ను విజిలెన్స్ అధికారులు సందర్శించడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర వేళ ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం...