మేడారంలో మ‌రుగుదొడ్ల వ‌ద్ద అరిగోస‌..!

మేడారంలో మ‌రుగుదొడ్ల వ‌ద్ద అరిగోస‌..! అక్క‌డ కూడా చేయి చాపుతున్న వైనం ఉచిత మ‌రుగుదొడ్ల కాడ అన‌ధికారికంగా వ‌సూళ్లు రూ.10నుంచి 20 వ‌ర‌కు ఇవ్వాల్సిందేనంట‌ దుర్గంధంతో అల్లాడిపోతున్న భ‌క్తులు కాకతీయ, మేడారం బృందం : మేడారం మహా జాతరలో భక్తులు ఎదుర్కొంటున్న పారిశుధ్య సమస్యలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహాజాతరలో ప్రభుత్వం వంద‌ల‌ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మరుగుదొడ్ల నిర్వహణ భక్తులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది....