పాసులు పక్కదారి
పాసులు పక్కదారి అర్హత లేనివారికే వీఐపీ, వీవీఐపీ దర్శనం! మేడారం జాతరలో ఇష్టారాజ్యంగా పాసుల జారీపై భక్తుల ఆగ్రహం. కాకతీయ, ములుగు ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న సమ్మక్క–సారలమ్మల మహా జాతర 2026లో విఐపి, వివిఐపి దర్శన పాసులు పక్కదారి పట్టినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న జాతర నేపథ్యంలో దర్శన వ్యవస్థలో పారదర్శకత ఉంటుందని అధికారులు చెబుతుండగా, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, ముఖ్య...