జాతరకు ఊహించని భక్తజనం
జాతరకు ఊహించని భక్తజనం మణుగూరు మినీ మేడారానికి పోటెత్తిన భక్తులు తోగ్గుడెం సమ్మక్క–సారక్క ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిట కాకతీయ,మణుగూరు : మణుగూరు మండలం తోగ్గుడెం గ్రామం లో నిర్వహిస్తున్న మినీ మేడారం సమ్మక్క–సారక్క జాతరకు ఊహించని స్థాయిలో భక్తులు తరలివచ్చారు.అధికారులు,ఆలయ కమిటీ అంచనాలకు మించి భక్తుల సంఖ్య పెరగడంతో జాతర ప్రాంగణం పూర్తిగా కిటకిటలాడింది.ఆలయ ప్రాంగణంలో ఇసుక వేస్తే రాలనంతగా భక్తుల సందడి కనిపించింది. సమ్మక్క–సారక్క తల్లులను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.తోగ్గుడెం గ్రామం మొత్తం జాతర వాతావరణంతో...