దళితులను నిలువెత్తున మోసం చేశాడు
దళితులను నిలువెత్తున మోసం చేశాడు కేసీఆర్‌పై పరకాల ఎమ్మెల్యే రేవూరి విమర్శలు పరకాలలో దళిత వాడలు మోడల్ కాలనీలు దళిత సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబాటుకు హామీ కాకతీయ, పరకాల : దళిత ముఖ్యమంత్రి చేస్తానని, తెలంగాణకు కాపలా కుక్కగా ఉంటానని చెప్పిన కేసీఆర్ చివరకు దళితులను నిలువెత్తున మోసం చేశాడని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పరకాల పట్టణ కేంద్రంలోని ఆర్‌ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన మాదిగ కుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు....