జాతరలో పవర్ కట్‌కు ఎవరు బాధ్యులు?

జాతరలో పవర్ కట్‌కు ఎవరు బాధ్యులు? కొత్త కాంట్రాక్టర్ ప్రయోగమే శాపమా? రాష్ట్రస్థాయి జోక్యమే కొంపముంచిందా? తీరా ఇప్పుడు కిందిస్థాయి అధికారులను బ‌లి చేయాల‌ని చూస్తున్నారా..? కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా, తెలంగాణ రాష్ట్ర కుంభమేళాగా పేరుగాంచిన శ్రీ సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో ఈసారి విద్యుత్ శాఖ తీవ్ర విమర్శల పాలైంది. రాష్ట్ర ప్రభుత్వం జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కోట్ల రూపాయలు ఖర్చు చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ, అత్యంత కీలకమైన విద్యుత్ సరఫరాలో మాత్రం ఘోర...