తిరుగువారం జాత‌ర‌కు పోటెత్తిన భక్తజనం

తిరుగువారం జాత‌ర‌కు పోటెత్తిన భక్తజనం మేడారం జాత‌ర‌కు ల‌క్షలాదిగా భ‌క్తులు వనదేవతల సన్నిధిలో భక్తి పారవశ్యం కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా ప్రసిద్ధిగాంచిన శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో తిరుగువారం వేళ వనదేవతల సన్నిధి భక్తజన సంద్రంగా మారింది. బుధవారం ఉదయం నుంచే తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు మేడారం బాట పట్టారు. జాతర ముగింపు దశకు చేరుకున్నప్పటికీ భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. భక్తులు ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం...