అంగన్వాడి పిల్లల పోషణపై ప్రత్యేక దృష్టి
అంగన్వాడి పిల్లల పోషణపై ప్రత్యేక దృష్టి కాకతీయ, కొమురవెల్లి : రసులాబాద్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో తల్లుల కమిటీ సమావేశాన్ని సర్పంచ్ పచ్చిమడ్ల అనూష స్వామి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రంలో పిల్లలందరూ పోషకాహారం తీసుకునే విధంగా తల్లులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రతిరోజూ అంగన్వాడి కేంద్రానికి వచ్చి అందిస్తున్న పోషకాహారాన్ని తల్లులు వినియోగించుకోవాలని, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ఇది ఎంతో అవసరమని ఆమె తెలిపారు. అంగన్వాడి సేవలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే...